ఇన్ఫోసిస్ అధినేతతో ‘ఐటీ’ ప్రకటన

telangana_660_061215104336

తెలంగాణ ఐటీ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోనే సాఫ్ట్ వేర్ కు పురుడుపోసిన ‘ఇన్ఫోసిస్’ అధినేత నారాయణ మూర్తి చేతుల మీదుగా తెలంగాణ ఐటీ పాలసీని ఆవిష్కరించనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు కార్యక్రమంలో పాల్గొననున్నారు. దాదాపు 4 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఐటీ పాలసీ రూపొందింది.

కాగా దేశంలో ఐటీ లో నంబర్ 1 గా ఉన్న బెంగళూరు సిటీని దాటేసే ప్రయత్నం ను చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ ను ఐటీ రాజధానిగా చేయాలని కృతనిశ్చయంతో మంత్రి కేటీఆర్ ఐటీ పాలసీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిచేయించారు. ఏప్రిల్ 4న ఆవిష్కరించే ఈ ఐటీ పాలసీలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ విస్తరించాలని యోచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *