ఇద్దరు బాలకార్మికులకు విముక్తి..

నగరంలోని శనివారం అంగడిబజార్ లో దినసరి వేతనంపై పనిచేస్తున్న ఇద్దరు బాలలకు మానవ అక్రమరవాణ నియంత్రణ విభాగం(ఎహెచ్ టియు) పోలిసులు శనివారం నాడు విముక్తి కల్పించారు.ఎహెచ్ టియు విభాగం ఇంఛార్జి ఇన్స్ పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో పోలిసులు శనివారం నాడు అంగడిబజార్ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కరీంనగర్ లోని రాజీవ్ నగర్ కు చెందిన యం.డి.గౌసోద్దీన్(12), చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన కొక్కుల.రాకేష్(14)లను గుర్తించి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి ఛైర్ పర్సన్ కొమురయ్య, జిల్లా బాలల రక్షణ అధికారి పర్వీన్ లకు అప్పగించారు. వెంటనే బాలలకు ఆశ్రమంలో సదుపాయం కల్పించారు. సదరు బాలల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *