
ఖమ్మం : ఒక మగాడు.. ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో సంచలనం రేపింది.జిల్లాలోని వాజేడులో మేక రమేశ్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను గురువారం పెళ్లి చేసుకున్నాడు. వాజేడు మండలం జంగాలపల్లి కి చెందిన రమేశ్, దేవి, సుషిత అనే ఇద్దరు మహిళలతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. వారి విషయం ఊరంతా తెలుసు.. ఆ గ్రామంలో కుల ,ఆచారాల ప్రకారం సహజీవనం చేస్తే బహిష్కరణ శిక్ష విధించే అవకాశం ఉంది. దీంతో కంగారుపడిన ఆ యువకుడు , వారి బంధువులు.. ఇద్దరు మహిళలను ఒప్పించి రమేశ్ తో వివాహం చేశారు.