ఇదో వింత.. ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ పై పొగడ్తలు..

కాలం కలిసొస్తే.. ఎడ్డొడు కూడా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వగలడని మన న్యూస్ చానాళ్లు నిరూపించాయి.. కానీ కాలం కలిసివస్తే రాజకీయాల్లో అసలు విలువలే ఉండవని కేసీఆర్-చంద్రబాబు తాజా మైత్రీ నిరూపించింది.. రాజకీయాల్లో అసలు కొట్లాటకు తావు లేదని తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ,-సీఎం కేసీఆర్ ల వ్యవహారం చాటిచెప్పింది..

001

కేసీఆర్ అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లగానే పరిస్థితిలో మార్పు వచ్చింది.. మరుసటి రోజు ఆంధ్రజ్యోతిలో కేసీఆర్ భగీరథుడు.. గోదావరిపై రివర్స్ డిజైన్ ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాడని వార్తవచ్చింది.. దీనివెనుక కేసీఆర్-రాధాకృష్ణల రాజీ వ్యవహారమే కారణమట.. బాబు సమక్షంలో వారిద్దరు పాత మిత్రలు, ప్రస్తుత శత్రువలైన కేసీఆర్-రాధాకృష్ణలు విబేధాలు పక్కనపెట్టి రాజీ కుదుర్చుకున్నారట.. అక్కడ రాజీ మొదలైందో లేదో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు తిట్టే వార్తలు ఇక మరుసటి రోజు నుంచి పొగడ్తల వార్తలతో కనిపించాయి..

ఎంతైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండదనడానికి కేసీఆర్-రాధాకృష్ణ తాజా రాజీయే ఉదాహరణ అని తేటతెల్లం అవుతోంది.. ఆంద్రజ్యోతి సపోర్ట్ తో ఇక తెలంగాణలో కేసీఆర్ ను ఏకిపారేసే మొగాడే లేడంటే అతిశయోక్తి కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *