‘ఇది 5 అడుగుల బుల్లెట్’

‘ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆయనే డీసీసీ ప్రెసిడెంట్ మృత్యుంజయం..’  కష్టేఫలిని నమ్ముకుని ముందుకెళ్తున్న ఆయనకు ఆ పనితీరుతోనే ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు. ఒకరా.. ఇద్దరా..  ఏకంగా కరీంనగర్ జిల్లాలోని అందరూ మాజీ నేతలందరూ వైరి పక్షంగా మారి పీఠం కదల్చడానికి చూసినా.. ఈ ఒక్కడి ముందు నిలవలేకపోయారు.. ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియానే మెప్పించి మళ్లీ డీసీసీ పీఠం అధిష్టించారంటే ఆయన పనితీరు అర్థం చేసుకోవచ్చు..

IMG-20150413-WA0027

సోనియా నుంచి అపాయింట్మెంట్ లెటర్..

మామూలుగా డీసీసీ ప్రెసిడెంట్ ను ఎవరు నియమిస్తారు.. పీసీసీ ప్రెసిడెంట్’.. ఇది అందరికీ తెలిసిందే.. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా మృత్యుంజయంను గతంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నాల లక్ష్మయ్య నియమించారు. ఆయన అకాల నిష్క్రమణ తెలంగాణలోని అందరు డీసీసీ ప్రెసిడెంట్ లకు ముప్పు తెచ్చింది. కొత్తగా వచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ కొత్త వారిని నియమించుకోవడం అనవాయితీ..? దీనిపై కరీంనగర్ జిల్లా నేతలతో సంప్రదింపులు జరిపారు కూడా.. కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో అందరూ నేతలు డీసీసీ పీఠం  తమకే కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ మృత్యుంజయంను సాగనంపేందుకు నానా ప్రయత్నాలు చేశారు. కానీ పగ్గాలు చేపట్టినప్పటినుంచి జనంలో ఉంటూ.. జనం కోసం పోరాడుతూ.. ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సూపర్ గా పనిచేశారు మృత్యుంజయం.. కానీ సొంత పార్టీ వారే కుంపటి పెట్టడంతో ఇక అమ్మ సోనియా ఆశీస్సుల కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడే తన కాలంలో చేసిన పనిని పార్టీ కోసం కష్టపడింది అమ్మకు వివరించారు. ఇంకే ముంది ఏకంగా అమ్మే ఆర్డర్ పాస్ చేసింది..

దేశ రాజకీయాల్ని శాసించే సోనియా ఏకంగా ఓ జిల్లా అధ్యక్షుడిని నియమించడం కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ జరగని మహా అద్భుతం.. ఆ అద్భుతాన్ని మృత్యుంజయం చేసి చూపించారు. పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుందని నిరూపించారు. పార్టీ కోసం అహర్నిషలు పోరాడే వారికి ఏ అడ్డంకులు పనిచేయవని నిరూపించారు. సోనియా ఆదేశంతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది మృత్యుంజయంను కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆ ఉత్తర్వులను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించడం కాంగ్రెస్ లో సంచలనం సృష్టిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *