Breaking News

ఇది మనకోసం..

received_1374101652640672

?1960 – 1990 మధ్యలో మీరు
? పుట్టినవారే అయితే
? ఇది మనకోసం..

⬛వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం……..

⬛పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన
తరమూ మనదే…….

⬛స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే…….

⬛చాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు……

⬛స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే…….

⬛మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం.
అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం……

⬛రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం……

⬛అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని
పాటలు వినేవాళ్ళం……

⬛VCR ని ఎలా వాడాలో తెలుసుకొని
వాడిన తరం మనదే…….

⬛అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే……

⬛అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే…..

⬛సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం……

⬛సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే……

⬛మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం………

⬛స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా మామూలు బట్టలతో వెళ్ళాం………

⬛ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.

⬛స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం. స్నేహితుల మధ్య ” కాకి ఎంగిలి ” చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం……..

⬛ఎవరూ ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం.
చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం……..

⬛జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం…….

⬛సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ, వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే…….

⬛శుక్రవారం సాయంత్రం ” చిత్రల హరి” కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే……

⬛ఆదివారం ఉదయం 9 కి పనులు తప్పించుకుని “మహాభారతము”
” రామాయణం” ” శ్రీకృష్ణ” చూసిన
తరమూ మనదే…

⬛ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే…

⬛అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే …….

⬛ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం
రెండు గంటలు వేచి ఉన్నది మనమే…

⬛పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే……

⬛రుపయికు థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు
నడిచిన కాలం మనదే….

⬛గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం.. మనమే.. మనమే
అమ్మ 5 పైసలు ఇస్తే బఠానీలు తిన్నదీ మనమే……

⬛గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట..
సిర్రగోనే ఆట.. కోతి కొమ్మ… అష్ట చెమ్మ… ఆడిన తరము మనదే….

⬛క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ,
కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే……

⬛ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే…..

⬛మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్,
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్… లేకున్నా
అంతులేని ఆనందాన్ని పొందాం…..

⬛మన పిల్లలకు అవి తెలియదు మన పెద్దలకు ఇవి తెలియదు……
కానీ మనం అవి ఇవి చూశాం……

⬛ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *