ఇది కేసీఆర్ చలువే..

 

తెలంగాణలో ఆర్థిక సామాజిక, అధ్యయనాల సంస్థ (సెస్) అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.. తెలంగాణ రాష్ట్ర తొలి మానవాభివృద్ది సూచికన సెస్ ప్రభుత్వానికి అందజేసింది. ఇంత కరువులోనూ తెలంగాణ దాదాపు 11 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించి దూసుకుపోతోందని స్పష్టం చేసింది.. అక్షరాస్యతలో అభివృద్ది, శిశుమరణాల రేటు తగ్గుదల, దాదాపు 7 జిల్లాల్లో ఆర్థికాభివృద్ధి బాగుందని కితాబిచ్చింది..

ఒక్క వైద్యం, వ్యవసాయం రంగంలో మాత్రం తెలంగాణ వెనుకబడి ఉన్నట్టు పేర్కొంది. మిగితా పారిశ్రామిక, సేవ రంగాల్లో వృద్ది కనపడింది. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న పథకాల వల్లే ఈ వృద్ధి సాధ్యపడిందని చెప్పవచ్చు.. దాదాపు ఈ ఏడాదిలో వర్షాలు కురవక పంటలు పండలేదు. కరువు దాపురించింది. దీంతో ఎవరూ పంటలు లేక ఆదాయం కనుమురుగై అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పింఛన్లు, రేషన్ ఇప్పుడు పెద్ద దిక్కవుతోంది. వచ్చే ఏడాది కరువు ఉంటే తెలంగాణలో దారుణ పరిస్థితులుంటాయి. తినడానికి, తాగడానికి ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రామాలు వృద్ధి పడకేస్తుందని స్పష్టం చేసింది..

మొత్తానికి మానవాభివృద్దిలో తెలంగాణలో ప్రగతి సాధించిందనే చెప్పాలి..అక్షరాస్యత, శిశుమరణాల  అదుపులో రాష్ట్రం ఒకింత పురోగతి సాధించింది. ఏడు జిల్లాలు  ఆర్థికవృద్దిని సాదించాయి. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు వెనుకబడ్డాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *