ఇక రేషన్ ఎక్కడినుంచైనా తీసుకోవచ్చు..

హైదరాబాద్ : గ్రామాలనుంచి పట్టణాలకు వలసవచ్చిన వారు రేషన్ సరుకుడు తీసుకోవడం లేదు.. తీసుకున్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీసుకోని సరుకులను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ‘ఈ-పాస్’ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో లబ్ధిదారులు సరుకులను ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ దేశంలోనే తొలిసారిగా ఏపీ,తెలంగాణల్లో అమలుచేస్తున్నారు.

ఈ ప్రక్రియలో ఆధార్ తో సరుకుల పంపిణీని అనుసంధానిస్తారు. కార్డు దారుని ఏ ఒక్కరి వేలిముద్రలు సరిపోయినా చౌకధరల దుకాణాల్లో సరకులను పొందే సౌలభ్యం కలుగుతుంది. దీనికోసం ప్రత్యేక మైన మిషన్లను రేషన్ షాపుల్లో ప్రవేశపెడతారు.

తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే అమలవుతోంది. దీన్ని రెండు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఫలితంగా బోగస్ కార్డుదారులకు ముకుతాడు పడనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *