
ఏపీ సీఎం చంద్రబాబు తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారి పల్లె నుంచి పుట్ట మట్టిని సేకరించారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాల్లోని మట్టిని, జలాన్ని సేకరించి ఏపీ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. అందుకే ఇలా సొంతూరు నుంచి మట్టిని సేకరించి పూజలు చేశారు చంద్రబాబు..
శాతవాహనులు రాజధాని, బుద్దుడు నడియాడిన నేల అమరావతి ప్రాంతం అని అందుకే ఏపీ రాజధాని కోసం మట్టి, జలం సేకరిస్తున్నామని తెలిపారు. అంతేకాదు నవ్యాంధ్ర రాజధానికోసం ప్రతీ జిల్లా కేంద్రంలో విరాళాల కోసం సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సెల్ ను ప్రారంభిస్తాని చంద్రబాబు చెప్పారు.