ఇందులో ఏది నిజం..?

aj namaste

-బడ్జెట్ పై రెండు పత్రికల్లో రెండు కథనాలు
-జనం బేజారు
కరీంనగర్, ప్రతినిధి : రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది.? జనాలకు మేలు చేస్తుందా..?
నిరాశపరిచిందా..? బడ్జెట్ లో కరీంనగర్ జిల్లాకు ఏమైనా వరాలున్నాయా? లాంటి
సందేహాలు జిల్లా ప్రజలకు రావడం సహజం. ప్రజలు సొంతంగా అనలిస్టులు కాదు కాబట్టి బడ్జెట్ లెక్కలు వారికి అర్థం కావు.. అందుకు పత్రికలు, టీవీ చానాళ్లను ఆశ్రయిస్తారు. కానీ అవి అయినా సమర్థవంతమైన, నీతిమంతమైన బడ్జెట్ కథనాలను అందిస్తున్నాయా అంటే లేదనే చెప్పొచ్చు.

పార్టీల వారీగా పత్రికలు.. కథనాలు
టీఆర్ఎస్ సపోర్ట్ గా ఉన్న నమస్తే తెలంగాణ బడ్జెట్ అహాఓహో అంటే.. తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉన్న ఆంధ్రజ్యోతి బడ్జెట్ నిరాశపరిచిందని కథనం ప్రచురించింది. ఈనాడు పత్రిక అటు బడ్జెట్ ను విమర్శించలేదు.. పొగడలేదు.. అటూ ఇటూగా ప్రచురించింది. ఈ పత్రికల్లో తమ బడ్జెట్ లెక్కలు వేసుకుంటే జనాలు పిచ్చెక్కడం ఖాయం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అసెంబ్లీలో ఒక బడ్జెటే.. కానీ పత్రికలు మాత్రం ఒకే జిల్లాకు ఇన్ని రకాలుగా కథనాలు వండి వార్చి తమ సొంత పైత్యాన్ని.. ప్రభుత్వాలపై ఉన్న ప్రేమ , కోపాన్ని ప్రదర్శించడం జనాలకు చికాకు తెప్పిస్తోంది. ఆంధ్రజ్యోతిలో వ్యతిరేకంగా.. నమస్తే తెలంగాణలో అనుకూలంగా ఉన్న బడ్జెట్ లో అసలు మనకు కలిగే ప్రయోజనం ఏంటో.. జిల్లా అభివృద్ధి ఏవిధంగా మేలుజరుగుతుందో సవివిరమైన కథనాలు ఇస్తే బాగుండేది. ఇలా పార్టీల వారీగా చీలిపోయిన పత్రికల కథనాలు జనం నమ్మకపోయే రోజులు మరికొద్ది రోజుల్లోనే వస్తాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *