
కోహ్లీ సేన శ్రీలంకలో చాలా ఘనంగా అడుగుపెట్టింది.. ఎవరూ ఊహించకుండా లంకలో లంకను దెబ్బతీసి తొలిటెస్ట్ లో ఆ జట్టును ఆలౌట్ చేసింది. అనక తొలి ఇన్నింగ్స్ లో 375 పరుగులు చేసింది. ఇక విజయం ఖాయమనుకున్నారంతా కానీ ఏం జరిగింది. అదే శ్రీలంక చేతిలో ఓడిపోయింది..
భారత సగటు అభిమాని, క్రీడా విశ్లేషకులు ఎవరూ ఊహించని పరాజయం భారత్ పరమైంది.కోహ్లీ సేన ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరూ కలలో కూడా ఊహించని పరాజయం.. శ్రీలంక దారుణంగా ఓడిపోతుందని అనుకున్నారంతా కానీ ఏకంగా 176 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక టీమిండియా 112 పరుగులకే కుప్పకూలి శ్రీలంక చేతిలో దారుణ పరాజయాన్ని చవిచూసింది..