Breaking News

ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు..

shafi wife dead

మాన వత్వం మంటగలిసింది.. పైసల కక్కుర్తిలో హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రి అమానుష చర్య నీచాతి నీచమైంది.. పురుటి నొప్పులతో వచ్చిన నిండు చూలాలిని ఆస్పత్రి సిబ్బంది డెలివరీ చేశారు. బిడ్డకు జన్మనిచ్చి చనిపోయిన ఆ తల్లిని, బతికి ఉన్న పసిగుడ్డును రోడ్డున పడేశారు.. రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చిన భర్త భార్య కోసం ఆస్పత్రికి వెళ్లగా బయట రోడ్డుపై భార్య శవం.. పక్కన పసికందు ఏడుపు చూసి చలించి పోయాడు. గుండెలవిసేలా ఏడ్చాడు..

మహబూబ్ నగర్ జిల్లా ఊట్కూర్ కు చెందిన మహ్మద్ షఫీ హైదరాబాద్ లో కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఆయన భార్య నిండు గర్బిణి. ఉదయం పనికి వెళ్లాక భార్యకు నొప్పుల రావడంతో భార్య ఆస్పత్రికి వెళ్లింది. కాన్పు చేశాక తల్లి మరణించగా.. బిడ్డ బతికింది.. దీంతో ఆస్పత్రి యాజమాన్యం కనికరం లేకుండా తల్లి శవాన్ని, బిడ్డను బయటపడేసింది.. రాత్రి వచ్చిన షఫీ తల్లిని , పసికందు.. తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని స్వంతూరు కు ఆర్టీసీ బస్ లో వెళ్లాడు..  మహబూబ్ నగర్ బస్టాండ్లో డబ్బులు అయిపోయి దీనంగా ఎదురుచూస్తున్న షఫీకి అక్కడున్న ఆర్టీసీ కార్మికులు, హోటల్ యాజమానికి 8 వేల ఆర్తికసాయం చేసి ఆటోలో తల్లి శవాన్ని పిల్లలను సొంత ఊరికి పంపించారు. పసిబిడ్డను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

ఇంతటి ఘోరమైన ఆకృత్యానికి పాల్పడ్డ ఆ ఆస్పత్రిని మూసేయాలని పలువురు కోరుతున్నారు. పేదరిక పెను శాపమైన షఫీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *