ఇండియా-యూరేషియాను ఢీకొట్టేది ఇక్కడే..

ఇటీవల నేపాల్ భూకంపం ఎంతటి పెను విశాధాన్ని నెలకొల్పిందే అందరికీ తెలిసిందే.. ఇప్పుడు అప్ఘన్, పాక్ సరిహద్దుల్లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించి జన ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఇక్కడ సంవత్సరానికి నాలుగు భూకంపాలు వస్తూనే ఉంటాయి.. ప్రపంచంలోనే అతిఎక్కువగా భూకంపాలు వచ్చేది హిమాలయాల్లోనే.  ఈ హిమాలయాలకు తూర్పున ఉన్నవే హిందూ కుష్ పర్వతాలు.. ఇక్కడే భూకంపం నిన్న 7.5 తీవ్రతతో వచ్చి అపార నష్టాన్ని మిగిల్చింది..

భూమి 6 కోట్ల ఏళ్ల క్రితం కదలడం ప్రారంభించింది.. ఇండియా-ఆస్ట్రేలియా కలిసికట్టు ఉండేది. ఇండియా పలకం ఉత్తరదిక్కుగా వెళితే.. ఆస్ట్రేలియా ఫలకం దక్షిణ దిశగా పయనించింది. అప్పుడు మొదలైన భూ పలకల కదలిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.  రెండు ఫలకాలు ఏడాదికి 2 అంగుళాల చొప్పున కదులుతాయి. ఈ ఫలితం ఇండియా హిమాలయాల ఫలకం , ఉత్తరాన యూరేషియా ఫలకంతో ఢీకొడుతుంది. దీంతో భారీ భూకంపాలు సంభవిస్తున్నాయి.. ఇండియా ఫలకం డీకొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి.. ఇప్పుడు ప్రతీ సంవత్సరం 2 అంగుళాల మేర హిమాలయాలు పెరుగుతున్నట్టు బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *