
నిత్యం వివాదాలతో సతమతమయ్యే సంచలనాల దర్శకుడు రామ్ గోపాల వర్మ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా ఓడిపోవడంపై స్పందించారు. ఇండియా ఓడిపోవడం తనకు చాలా సంతోషాన్నిచ్చిదన్నారు. ఇండియాని ఇలాగే ఓడించడండి అంటూ ఇతర క్రికెట్ జట్లను కోరారు. ఇంతటితో ఆగకుండా నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి క్రికెట్ ను ద్వేషిశిస్తున్నాననీ. క్రికెట్ వల్ల సామన్య జనం పనులు మానేసి టీవీలు చూస్తూ కూర్చుంటున్నారని తన దైన శైలిలో కామెంట్లు విసిరాడు..
మద్యపానం, ధూమపానం వల్ల కలిగే చెడు కంటే క్రికెట్ వల్లే చెడు ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నాడు. ఇది చివరగా ‘క్రికెటైటిస్’ అనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి బారి నుంచి నా దేశాన్ని రక్షించాల్సిందిగా దేవుళ్లందరినీ ప్రార్థిస్తానని ’’రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్స్ పై క్రికెట్ అభిమానులు కొందరు మండిపడుతుండగా… ఈ వేదాంతంపై కొందరు మంచిగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు.