Breaking News

ఇండియా ఈసారి కప్ గెలవడం కష్టమే..

IndiaTv587af4_30india

మొన్నటి ఆస్ట్రేలియా పర్యటన.. నిన్నటి వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ ఈ రెండు చూసిని తర్వాత ఇండియా ఈసారి వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని తేటతెల్లమైంది. ప్రపంచకప్ ముందట సన్నాహానికి పెద్ద ఎదురుదెబ్బ కలిగింది. గత వరల్డ్ కప్ గెలిచి డిఫెడింగ్ చాంపియన్ గా బరిలో నిలిచిన ఇండియా తన తొలి వార్మప్ మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్ లో బౌలర్లు చెత్త బోలింగ్ తో 371 పరుగులు సమర్పిస్తే.. బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టడంతో 265 పరుగులకే అలౌట్ అయి వరల్డ్ కప్ ఆశలను గల్లంతు చేసింది.

బ్యాటింగ్, బౌలింగ్ లలో ఘోరంగా విఫలమైన టీమిండియా లోపాలు సరిదిద్దుకోకపోతే ఈసారి కనీసం తొలిరౌండ్ దాటడం కూడా కష్టమే.. ధోని డకౌట్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం ధోని ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ బాగా చేస్తే బౌలర్లు విఫలమవుతారని.. బౌలింగ్ బాగా చేస్తే బ్యాటింగ్ విఫలమవుతున్న భారత్ జట్టు దీన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ లోపు తుది 11 మందిని ఎవరిని ఆడించాలో అర్థమవుతుందని చెప్పారు. ఇప్పడైతే ఎవరిని బరిలో దించాలనేది అర్థం కావడం లేదని నిరాశ చెందారు.

ప్రస్తుత టీమిండియా లో ఎవరూ ఫామ్ లో లేరు. బౌలర్లు ధారలంగా పరుగులిస్తున్నారు. బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నారు. ఆల్ రౌండర్ లేడు. మొత్తంగా ఆస్ట్రేలియా టూర్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క గెలుపు లేదు. దీంతో ఈ వరల్డ్ కప్ లో టీమిండియా కప్ కొట్టడం మాట దేవుడెరుగు.. కనీసం మొదటి రౌండ్ దాటితే అదే పదివేలు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *