ఇండియాకు వెంచర్ క్యాపిటలిస్టులు కాదు.. అడ్వెంచర్ క్యాపిటలిస్టులు కావాలి: కెటిఆర్

భారత దేశానికి వెంచర్ క్యాపిటలిస్టులు కాదు.. అడ్వెంచర్ క్యాపిటలిస్టులు కావాలిమంత్రి కేటీ రామారావు

జీఈఎస్ సన్నాహక సమావేశంలో కీలకప్రసంగం

పెట్టుబడులకు భారత్ స్వర్గధామమని మంత్రి కేటీ రామారావు అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా యువత భారత్‌లోనే ఉన్నారని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, టీఎస్ ఐపాస్ ను ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఇక్కడి యువత ఆలోచనలకు ఆసరా ఇచ్చేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు కాదు.. అడ్వెంచర్ క్యాపిటలిస్టులు కావాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక వరల్డ్ గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సదస్సు జరగనున్న నేపథ్యంలో హైటెక్స్‌లో సన్నాహక సమావేశం జరిగింది. నీతి ఆయోగ్, టీ హబ్, ఐఎన్కే సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించాయి. ఇందులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థితోపాటు యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ సమావేశంలో ప్రసంగించారు. భారత్ లో యువ రక్తం ఉరకలెత్తుతోందని, ఇప్పుడు ఇండియా టైం నడుస్తోందని కేటీఆర్ చెప్పారు. ఆలోచన ఒక్కటే శక్తివంతమైందని, సమయం వచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. అలాంటి నూతన ఆలోచనలకు భారత్ వేదికైందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు.

మంత్రి కేటీఆర్‌పై నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రశంసలు

సమావేశంలో మంత్రి కేటీఆర్ పై నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి ప్రశంసలు కురిపించారు. జ్ఞానం, వృత్తి నైపుణ్యం కలగలిసిన డైనమిక్ లీడర్ కేటీఆర్ అని అభివర్ణించారు. ఒక వ్యక్తిలో రెండు క్వాలిటీస్ ఉండటం అరుదైన అంశమని కితాబిచ్చారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే, ఒక సాంకేతిక నిపుణుడు ప్రసంగిస్తున్నట్టే ఉందని కైలాశ్ సత్యార్థి చెప్పారు.

జీఈఎస్ నేపథ్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి యువ పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన లభించింది. గ్లోబల్ సమ్మిట్‌కు ముందు జరిగిన సమావేశం తమకు ఒక కర్టన్ రైజర్‌లా ఉపయోగపడిందని ఆంట్రప్రెన్యూర్లు చెప్పారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *