Breaking News

‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’లో కేసీఆర్ ముందు

ioyear-kcr2

హైదరాబాద్, ప్రతినిధి : సీఎన్ఎన్ ఐబీఎన్ ప్రతీ సంవత్సరం ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో 2014 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ అందరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. 31 శాతం ఓట్లతో ప్రత్యర్థులకు అందనంతగా ఉన్నారు. ఈ పోటీ జనవరి 31 వరకే ఉంది.

సీఎన్ఎన్ ఐబీఎన్ కు కూడా కేసీఆర్ కు ఇంత ఫాలోయింగ్ ఉన్నదని ఊహించలేకపోయింది. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆంకాంక్షలను నెరవేర్చిన ఘనత కేసీఆర్ కు దక్కిందని.. దాంతోనే ఆయన దేశంలోని 29వ నూతన రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారని తెలిపారు.

ఇక ఈ పోటీల్లో సీఎం కేసీఆర్ తరువాత 22 శాతం ఓట్లతో కేరళ పోలీస్ ఆఫీసర్ పి. విజయన్ రెండోస్థానంలో , బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లు 6 శాతం ఓట్లతో మూడు , నాలుగు స్థానల్లో , ఇండియన్ ఆర్మీ 5 వస్థానంలో.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 6వస్థానంలో, బీజేపీ అధ్యక్షుడు 7 వ స్థానంలో నిలిచారు.

మరి సీఎం కేసీఆర్ కు మీరు కూడా ఓటెయ్యాలనుకుంటే www.indianoftheyear.comలోకి వెళ్లి సీఎం కేసీఆర్ కు ఓటేయ్యండి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *