
ఉదయం నుంచి తెలంగాణ అవతరణ దినోత్సవాలతో బిజీ బిజీగా గడిపిన సీఎం కేసీఆర్ సాయంత్రం ఇంటికి (బేగంపేటలోని సీఎం అధికారిక నివాసం) చేరుకోగానే సేదతీరారు. తన భద్రత , ఇంటి పని, వంటపని , సహాయకులతో కలిసి ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను విని ఆర్థికసాయం చేశారు. అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు.
తెలంగాణ స్వరాష్ట్ర కళ నెరవేరి సంవత్సర కాలం పూర్తవడంతో సీఎం కేసీఆర్ ఇవాళ ఎంతో ఆనందంగా కనిపించారని.. మా అందరిని ఆప్యాయంగా పలకరించారని సీఎం ఇంటి లోని సిబ్బంది, పనివారు మీడియా కు చెప్పారు.