ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌ల ప‌థ‌కం మార్చి నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభం: మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌ల ప‌థ‌కం మార్చి నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభం: మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌లు

మార్చి నెలాఖ‌రు క‌ల్లా ప్రారంభం

ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి

స‌మీక్షించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

హైద‌రాబాద్:  సిఎం కెసిఆర్ ముందు చూపుతో ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌ల ప‌థ‌కం మార్చి నెలాఖ‌రుక‌ల్లా ప్రారంభం కావాల‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో సిద్దం కావాల‌ని సూచించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కార్యాల‌యంలో మంత్రి అధికారుల‌తో శుక్ర‌వారం ఈ అంశం మీద స‌మీక్షించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, సీ ఎం కెసిఆర్ ఎంతో ముందు చూపుతో స‌ర్కారే ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్యానికి బాస‌ట‌గా నిలుస్తూ, ప‌రీక్ష‌లు చేయించి, ఉచితంగా కంటి అద్దాలు, అవ‌స‌ర‌మైతే శ‌స్త్ర చికిత్స‌లు చేయించాల‌ని గ‌తంలో ఎన్న‌డూ ఏ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌ని విధంగా ఇంటింటికీ కంటి ప‌రీక్ష‌ల ప‌థ‌కాన్ని చేప‌ట్టార‌న్నారు. ఇందుక‌నుగుణంగా సాధ్య‌మైనంత తొంద‌ర‌లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మార్చి నెలాఖ‌రు క‌ల్లా ప‌థ‌కం ప్రారంభ‌మ‌య్యే విధంగా అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధం కావాల‌ని అధికారులను మంత్రి ల‌క్ష్మారెడ్డి ఆదేశించారు. శిబిరాల నిర్వ‌హ‌ణ ఎలా? ఏయే ప‌రిక‌రాలుండాలి? ప‌్ర‌స్తుతం ఉన్న ప‌రిక‌రాలు స‌రిపోతాయా? అద‌నంగా కావాలా? వాటిని స‌మ‌కూర్చుకోవ‌డం ఎలా? స‌్క్రీనింగ్ కి మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం ఎంత‌? క‌ంటి అద్దాలు ఉచితంగా ఇవ్వాలి, శ‌స్త్ర‌చికిత్స‌లు చేయించ‌డం… స్క్రీనింగ్ ఎంత కాలం చేయాల్సి ఉంటుంది? వ‌ంటి అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని మంత్రి సూచించారు. మార్చి నెలాఖ‌రులోగా క‌నీసం హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఈ ప‌థ‌కం ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. మిగ‌తా జిల్లాల్లో మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభ‌మ‌య్యే విధంగా చూడాల‌ని చెప్పారు.  ఈ స‌మీక్ష‌లో కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, సంబంధిత శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *