ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ స్టేట్ ఫస్ట్

నేడు ప్రకటించిన ఇంటర్ రెండవ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ నభూతో, న భవిష్యత్ అన్న విధంగా మార్కులు సాధించి కార్పోరేట్ కళాశాలలకు ధీటుగా విజయయాత్ర సాగించి తన సత్తా చాటింది. ఎమ్.పి.సి విభాగంలో కె.రచనా, కె.సాయిక్రిష్ణ అనే ఇద్దరు విద్యార్ధులు 991/1000 మార్కులు సాధించి రాష్ర్టంలో ప్రథమ స్థానంలో (స్టేట్ ఫస్ట్) గా నిలిచారు. బై.పి.సి విభాగంలో ఎ.మీనా ,  కె.విద్యారెడ్డి 988/1000 మార్కులతో రాష్ర్టంలో నాల్గవ స్థానంలో నిలిచారు. ఎమ్.పి.సి విభాగంలో ఎ.వికాస్ 988 మార్కులతో రాష్ర్టంలో నాల్గవ స్ధానంలో, కె.శైలేందర్ 986 మార్కులతో రాష్ర్టంలో 6వ స్ధానంలో, ఎస్.సాయికిరణ్, ఎస్.పూజా రెడ్డి 985 మార్కులతో రాష్ర్టంలో 7వ స్ధానంలో నిలిచారు. బై.పి.సి విభాగంలో జి.నందిని ,  డేవిడ్ పాల్ 986 మార్కులు ఇంతియాజ్ బేగమ్ 985 మార్కులు సాధించారు. ఎమ్.ఇ.సి విభాగంలో చేతన్ ముందడ 976/1000 మార్కులు, సి.ఇ.సి విభాగంలో కె.అవినాష్ 951/1000 మార్కులు సాధించారు. ఎమ్.పి.సి విభాగంలో 980 ఆపై మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 20,  బై.పి.సి విభాగంలో 980  ఆపై మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 14.

-మొన్న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో నేడు రెండవ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ స్టేట్ ఫస్ట్ రావడం నాకెంతో ఆనందంగా ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్ధల చైర్మెన్ వి.నరెందర్ రెడ్డి తెలిపారు. పకడ్బందీ ప్రణాళికతో రెండు సంవత్సరాలు నిరంతరం కృషి చేయడం వలన ఇంతటి ఘనవిజయం సాధించగలిగామని ఆయన తెలిపారు.. ఇంటర్ తోపాటు విద్యార్థినీ, విద్యార్థులను ఎంసెట్ ,  ఐ.ఐ.టి లో ప్రావీణ్యత సాధించడానికి అల్ఫోర్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. ఇంటర్ సెకండియర్ ఫలితాలలో అఖండ విజయం సాధించిన మా చిన్నారులకు , వారి తల్లిదండ్రులకు నరెందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి ఘనవిజయానికి తోడ్పడిన తమ అధ్యాపక బృందానికి నరెందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *