ఇంటర్ లో 55.62 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బుధవారం విడుదల చేశారు. మొత్తం 4,31,363 మంది పరీక్ష రాయగా వీరిలో 2,39,954 మంది పాసయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత 55.62శాతం గా నమోదైంది.
71శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ 45, కరీంనగర్ 51 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 43శాతం ఉత్తీర్ణతతో నల్గొండ తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే తక్కువ ఉత్తీర్ణతతో చివరిస్తానంలో నిలిచింది.
కాగా బాలుర కంటే బాలికలు 12.08 శాతం అధికంగా పాసయ్యారు. ఏప్రిల్ 26నుంచి విద్యార్థులు మార్కుల జాబితాను ఇంటర్ నెట్ నుంచి పొందవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *