ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు నేడు విడుదల

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను ప్రకటిస్తారు. జనరల్ , వృత్తి విద్య ఫలితాలను రెండింటిని ప్రకటిస్తారు.

రాష్ట్ర విభజన తర్వాత ఇంటర్మీడియెట్ రెండుగా విడిపోయింది. తెలంగాణ సొంతంగా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ఫలితాలను అధికారులు విడుదల చేయడం విశేషం. ఫలితాలను ఇంటర్ నెట్, మోబైల్ ద్వారా తెలుసుకునేలా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.examresults.ts.nic.in, http://results.cgg.gov.in , www.manabadi.com,  ద్వారా తెలుసుకోవచ్చు.

ఈసేవా కాల్ సెంటర్ 1100కు బీఎస్ఎన్ ఎల్ నుంచి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. దాంతో పాటు 1800425 1110 టోల్ ప్రీ నంబర్ కు ఏదైనా సెల్ /ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

ఎసెమ్మెస్ ద్వారా తెలుసుకోవాలనుకునే వారు IPE2  అని స్పేస్ ఇచ్చి హాల్ టికెలట్ నంబర్ ను టైప్ చేసి 54242కు ఎసెమ్మెస్ చేస్తే ఫలితాలు మొబైల్ కు వస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *