ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బంది ఏర్పాటు

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బంది ఏర్పాటు

కరీంనగర్: జిల్లాలో జరుగు ఇంటర్మియట్ పరీక్షలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పారాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 3నుండి 22వ తేది వరకు ప్రాక్టికల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు 9,778 మంది హజరు అవుతున్నారని తెలిపారు. అలాగే వ్రాత పరీక్షలు మార్చి1 నుండి 16 వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి సంవత్సరానికి 18,234 మంది, ద్వితీయ సంవత్సరానికి 19,722 మంది విద్యార్ధులు హజరు అవుతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వాహణ సందర్భంగా విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవిలో పరీక్షలున్నందున త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, అత్యవసర వైద్య సేవలందించుటకు మెడికల్ టీంలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా తగిన పోలీసు బందోబస్తు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఆయేషా మస్ర్రత్ ఖానం, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎల్. సుహసిని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎమ్. రాజేశం, ఆర్.టి.సి నుండి జగదీశ్వర్, ట్రాన్సుకో ఎ.డి. మాధవరావు, జిల్లా విద్యా కమిటి సభ్యులు వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, సత్యవర్ధన రావుతదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *