ఇంజ‌నీర్ల ప‌నితీరు నిర్థార‌ణ‌కు ప్ర‌త్యేక యాప్ – ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌

జీహెచ్ఎంసీలో ఇంజ‌నీర్లు ప్ర‌తిరోజు నిర్వ‌ర్తించే ప‌నులను స‌మీక్షించేందుకు ప్ర‌త్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్న‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ తెలియ‌జేశారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, చీఫ్ ఇంజ‌నీర్లు జియాఉద్దీన్‌, మోహ‌న్ నాయ‌క్‌, జోన‌ల్క‌ మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌ల‌తో క‌లిసి చార్మినార్ జోన్‌లో చేప‌ట్టిన రోడ్డు నిర్మాణ‌, పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల‌పై శ‌నివారం నాడు ప్ర‌త్యేక స‌మీక్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ ఇంజ‌నీర్ల ప‌నితీరులో మ‌రింత జ‌వాబుదారీగా ఉండేందుకు ప్ర‌తిరోజు వారు చేప‌ట్టిన రోడ్ల పున‌రుద్ద‌ర‌ణ, పూడ్చివేసిన రోడ్ల‌పై గుంత‌లు త‌దిత‌ర వివ‌రాల‌ను రోజు ఫోటోల‌తో స‌హా అప్‌లోడ్చే సేందుకుగాను ప్ర‌త్యేకంగా యాప్‌ను జీహెచ్ఎంసీ రూపొందిస్తోంద‌ని తెలియ‌జేశారు. మ‌రో రెండు మూడురోజుల్లో ప్ర‌వేశ‌పెట్టే ఈ యాప్ ద్వారా ప్ర‌తి ఇంజ‌నీర్ ప‌నితీరును స‌మీక్షించే అవ‌కాశం ఉన్న‌తాధికారుల‌కు ఏర్ప‌డుతుంద‌ని, దీంతో పాటు ఇంజ‌నీర్ల మ‌ధ్య పోటీత‌త్వం కూడా పెరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తిరోజు చేప‌ట్టే రోడ్ల‌పై గుంత‌ల పూడ్చివేత‌, రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు సంబంధించి ప‌నుల‌కు ముందు అనంత‌రం ఫోటోల‌ను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంద‌ని తెలియ‌జేశారు. జీహెచ్ఎంసీలోని అసిస్టెంట్ ఇంజ‌నీర్లు, న్యాక్ ద్వారా నియ‌మితులైన ఇంజ‌నీర్లు ప్ర‌తిరోజు సంబంధిత వార్డులో ప‌ర్య‌టించి స్థానికుల‌తో మ‌మేక‌మై రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, వ‌ర్షాకాల సంబంధిత ప‌నుల‌పై చ‌ర్చించి చేప‌ట్టాల‌ని సూచించారు. రానున్న రెండు రోజుల్లో వార్డుల‌వారిగా స‌మావేశాల‌ను నిర్వ‌హించి అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తుల‌ను వారం రోజుల్లోగా పూర్తిచేసి జీహెచ్ఎంసీ ప‌ట్ల న‌గ‌రవాసుల్లో విశ్వాసాన్ని క‌ల్పించాల‌ని ముఖ్య కార్య‌ద‌ర్శి స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఇంజ‌నీర్, ఇత‌ర‌ అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో విధిగా జీహెచ్ఎంసీ జాకెట్‌ల‌ను ధ‌రించాల‌ని, దీని వ‌ల్ల న‌గ‌ర‌వాసుల నుండి ప్ర‌త్యేక గుర్తింపు ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. తాము ప్ర‌తిరోజు చేప‌ట్టే ప‌నుల‌ను న‌గ‌ర‌వాసుల‌కు తెలియ‌జేసేలా ట్విట్ట‌ర్ ఖాతాల‌ను తెరిచి స‌మాచారాన్ని అందించాల‌ని సూచించారు.
arvind kumar new 4     arvind kumar new 1
సిటీజ‌న్ల‌ను గౌర‌విద్దాం – క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి
న‌గ‌రంలో పెద్ద ఎత్తున అభివృద్ది, రోడ్డు నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, ఈ ప‌నులకు సంబంధించే స‌మాచారాన్ని, అవి పూర్తయ్యే తేదీ ఇత‌ర వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా న‌గ‌ర‌వాసుల‌కు స‌మాచారం అందించ‌డం ద్వారా వారిని గౌర‌వించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుత వ‌ర్షాకాల సీజ‌న్‌లో రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, గుంత‌ల పూడ్చివేత‌కు ప్ర‌త్యేకంగా 384 మ‌న్సూన్ బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ఇంత పెద్ద స్థాయిలో మ‌రే న‌గ‌రంలోనూ ఏర్పాటు చేయలేద‌ని పేర్కొన్నారు. రోడ్ల‌పై ఏర్ప‌డే గుంత‌ల ద్వారానే అధిక మొత్తంలో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని, ఇటీవ‌ల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్ర‌స్తావిస్తూ రోడ్ల‌పై పాట్‌హోల్స్‌ను అదేరోజు పూడ్చివేయ‌డంలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుత వ‌ర్షాకాల సీజ‌న్‌లో సీసీ రోడ్ల నిర్మాణాల‌ను కొన‌సాగించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంవ‌త్స‌రం నుండి పూడిక ప‌నుల‌ను సంవ‌త్స‌రం మొత్తం చేప‌ట్టేలా టెండ‌ర్ల‌ను ఖ‌రారు చేసినందున పూడిక ప‌నుల‌ను నిరంత‌రం కొన‌సాగించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. రోడ్ల ప‌రిస్థితిపై వివిధ ప‌త్రిక‌లు, సోష‌ల్ మీడియాల్లో వ‌చ్చే ప్ర‌తికూల వార్త‌ల‌పై వెంట‌నే స్పందించాల‌ని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో కొత్త‌గా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, బ‌స్‌బేలా నిర్మాణ ప‌నుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌పై పూర్తిచేయాల‌ని కోరారు. హైద‌రాబాద్‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను క్ర‌మంగా వేస్తున్న‌వారిని గుర్తించి జ‌రిమానాలను విధించాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా చార్మినార్ జోన‌ల్ క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ చార్మినార్ జోన్‌లో ప్ర‌స్తుతం రూ. 38.30 కోట్ల రూపాయ‌ల రోడ్ నిర్మాణ ప‌నులు న‌డుస్తున్నాయ‌ని, మ‌రో రూ. 10.64 కోట్ల ప‌నుల‌కు టెండ‌ర్ ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంద‌ని వివ‌రించారు. త‌మ జోన్ ప‌రిధిలో రోడ్ల‌పై 1370 గుంత‌లు ఏర్ప‌డ‌గా 1100ల‌ను పూడ్చివేశామ‌ని మిగిలిన‌వి కూడా వెంట‌నే పూర్తిచేయ‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు. కాగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేదించి వాటి స్థానంలో జ్యూట్, క్లాత్ బ్యాగ్‌ల‌ను ఉప‌యోగించేలా చేప‌ట్టిన కార్య‌క్ర‌మంలో భాగంగా ఏర్పాటు చేసిన జ్యూట్ బ్యాగ్‌ల స్టాల్‌ను ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డిలు ప‌రిశీలించారు. అనంత‌రం హ‌రిత‌హారంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్క‌లు నాటారు.
రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన అర్వింద్‌కుమార్‌
రాజేంద్ర‌న‌గ‌ర్ స‌ర్కిల్ బుద్వేల్ క్రాస్‌రోడ్స్ వ‌ద్ద నిర్వ‌హిస్తున్న రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ నేడు ఉద‌యం అక‌స్మికంగా త‌నిఖీ చేశారు. చార్మినార్ జోన్ ప‌రిధిలో ఇంజ‌నీరింగ్ ప‌నుల పై రాజేంద్ర‌న‌గ‌ర్ డిప్యూటి క‌మిష‌న‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మీక్ష స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు వ‌స్తున్న దారిలో రోడ్ల మ‌ర‌మ్మతులు జ‌రుగుతుండ‌గా ఆ ప‌నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. రోడ్ల‌పై ఏర్ప‌డ్డ గుంత‌ల‌ను పూడ్చడంలో శాస్త్రీయ ప‌ద్ద‌త‌ల‌ను పాటించ‌డం, ముఖ్యంగా బిటి మిక్సింగ్‌, ఉష్ణోగ్ర‌త‌లు ఏ స్థాయిలో ఉండాలి, గుంత‌లు ఏర్ప‌డ్డ రోడ్ల‌పై ఎంత మేర గుంత‌లు త‌వ్వాలి త‌దిత‌ర వివ‌రాల‌ను ముఖ్య కార్య‌ద‌ర్శి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌లు ఉన్నారు.
arvind kumar new 2     arvind kumar new 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *