ఇంజనీరింగ్ విద్యార్ధుల సమస్యలపై టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన

తెలంగాణ రాష్ట్ర్రంలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్ధులకు క్రెడిట్స్ కి సంబంధించి 40 శాతం క్రెడిట్స్ ఉన్న వారికి 3వ సంవత్సరంలోకి అనుమతి ఇవ్వాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర్ర అధ్యక్షులు చిలుక మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాదిమంది ఇంజనీరింగ్ విద్యార్ధులు హైదరాబాద్ లోని జేఎన్టీయు వైస్ ఛాన్స్ లర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయం చేయాలని కోరుతూ జేఎన్టీయుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అనంతరం వైస్ చాన్స్ లర్ శ్రీమతి శైలజా రామయ్యర్ గారికి విద్యార్ధుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరుతూ.. విన్నవించడం జరిగింది.

2

ఈసందర్భంగా చిలుక మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ…. జేఎన్టీయు అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్ధులకు మొత్తం 112 క్రెడిట్స్ ఉండగా, అందులో 40శాతం అంటే 45 క్రెడిట్స్ సాధిస్తేనే 3వ సంవత్సరంలోకి అనుమతి ఇవ్వాల్సి ఉండగా జేఎన్టీయు మాత్రం విద్యార్ధులకు 45క్రెడిట్స్ దక్కినా డిటెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి అనాలోచిత విధానాల వల్ల రాష్ట్ర్రంలో దాదాపు 8వేల మంది ఇంజనీరింగ్ విద్యార్ధులు విద్యా సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. ఒకవైపు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ రద్దు చేయడం ద్వారా ఆ కాలేజీలో విద్యార్ధులకు తరగతులు నిర్వహించక పోవడం వల్ల క్రెడిట్స్ ఏవిధంగా సాధిస్తారని ప్రశ్నించారు? ఇప్నటికైనా

ప్రభుత్వం స్పందించాలని జేయన్ టియు అధికారులు నిద్ర మత్తులోనుంచి మేల్కొని విద్యార్ధుల భవిష్యత్తును కాపాడాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్ధులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి మెరాజ్ ఖాన్ మరియు రాష్ట్ర్ర ఉపాధ్యక్షులు టీ.ప్రసాద్ తో పాటు మోహన్ ముదిరాజ్, శివ, రాములు, సందీప్ యాదవ్, గోపీకృష్ణ, రోహిత్, రామకృష్ణ, మణికాంత్, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *