
హైదరాబాద్ : చంద్రబాబు హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలకు రెక్కలు తొడిగారు.. వైఎస్ హయంలో కాలేజీలు విచ్చలవిడిగా వచ్చాయి. దీంతో తెలంగాణ , ఏపీల్లో ఇంజనీరింగ్ కాలేజీలు వరదలా వచ్చాయి. సరైన లెక్చర్లర్లు లేకున్నా, వసతులు లేకున్నా ప్రభుత్వాల నుంచి కోట్లకు కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ పొందుతూ లబ్ధి పొందాయి.
కానీ తెలంగాణ వచ్చినంక సీన్ మారింది. ప్రభుత్వ ఫీజు దోపిడీని అరికట్టింది. జేఎన్ టీయూహెచ్ తనిఖీలతో కాలేజీలు గుట్టు రట్టయ్యింది. వసతులు లేని కాలేజీల అనుమతులను జేఎన్ టీయూహెచ్ రద్దు చేసింది. దీంతో 160,000 వేలకు పైగా ఉన్న సీట్లు ప్రస్తుతానికి 91 వేలకు తగ్గాయి. జేఎన్ టీయూహెచ్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు. కొన్ని కాలేజీలకు సీట్ల కోత విధించింది. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది.