మార్చి 31 లోగా అనుమతించిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : జూపల్లి

సీసీ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచేలా దిశానిర్ధేశం

ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31 లోగా అనుమతించిన రోడ్ల నిర్మాణం పూర్తి కావాలి

పరిపాలన అనుమతులు ఇచ్చిన రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి

గ్రామసభ తీర్మాణాలను త్వరితగతిన సేకరించాలి

20 శాతం కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు లేఖలు అందజేసిన సీసీ రోడ్ల నిర్మాణానికి అనుమతించాలి

హైదరాబాద్: మార్చి 31లోగా పరిపాలన అనుమతులు మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో  పూర్తి చేయాల్సిందేనని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సచివాలయం నుండి అన్ని జిల్లాల ఇంజనీరింగ్ అధికారులతో సీసీ రోడ్ల నిర్మాణంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాల్లో ప్రతిపాదించిన రోడ్లు, పరిపాలనపరమైన అనుమతులు మంజూరైన రోడ్లు, పనులు ప్రారంభమైన రోడ్లకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. పలు జిల్లాల్లో పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చిన పనులు ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31 లోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయకపోతే కేంద్ర నిధులు నిరుపయోగం అవుతాయన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకొని పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామసభల తీర్మాణాలను త్వరితగతిన తెప్పించుకోవాలని, ఆ దిశగా అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే 20 శాతం కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు లేఖలు అందజేసిన చాలని, వచ్చే ఆర్ధిక సంవత్సరం నిధులనుంచి కూడా ఈ మొత్తాన్ని తీసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఈఎన్సీ సత్యనారాయణ రెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి సైదులు తదితరులు పాల్గొన్నారు.

jupaly.

 

About The Author

Related posts