ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోర పరాజయం

బ్రిస్బేన్ : బ్రిస్బేన్ వన్డేలో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న ఇండియా కెప్టెన్ ధోని నిర్ణయం బెడిసికొట్టింది. ఏ ఒక్కభారత బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేక పెవిలియన్ బాట పట్టారు.

సువర్ట్ బిన్ని ఒక్కడే 44 పరుగులు చేసి ఆదుకున్నాడు. రాయుడు -23, ధోని-34, రహానే-33 పరుగులు చేసి అవుట్ అయ్యారు. బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియా 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది.. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసి ఫిన్ 5 కీలక వికెట్లు తీశాడు. అండర్సన్ -3, అలీ-2 వికెట్లు తీసి ఇండియా నడ్డి విరిచారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కేవలం 27.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెల్ -88 పరుగులు, టేలర్ -56 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్ విజయాన్ని సులభతరం చేశారు.. కాగా ఇండియా బ్యాటింగ్ అర్డర్ ను కుప్పకూల్చిన ఫిన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.