ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి

కరీంనగర్: ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య అన్నారు. శనివారం స్ధానిక రెవిన్యూ క్లబ్ లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాభావ పరిస్ధితుల వలన భూగర్భ జలాలు తగ్గి నీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వర్షపు నీరు వృధాకాకుండా ప్రతి ఒక్కరు వారి ఇంటిలో ఖాళీగా ఉన్న స్ధలాలలో ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలు పెంచేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్, కలెక్టరేటు పరిపాలన అధికారి రవిందర్, టి.ఎన్.జి.ఓ. అధ్యక్షులు మారం జగదీశ్వర్, సెక్రటరి సుగుణాకర్ రెడ్డి, రెవెన్యూ క్లబ్ సెక్రటరీ సి.హెచ్. కృష్ణచైతన్య, జాయింట్  సెక్రటరీ కమరొద్దిన్, కాళీచరన్, కేశవరెడ్డి, శంకర్, రాజూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

inkudu          ink gu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *