
బాంబుల తయారీ, మ్యాడుల్స్ పేల్చడంపై వీడియోలో అప్ లోడ్ చేస్తూ దేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఐఎస్ ఐఎస్ రెండు వెబ్ సైట్లను భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ బ్లాక్ చేసింది. వాటితోపాటు జమ్ముకాశ్మీర్ రెండు ఫేస్ బుక్ పేజీలను కూడా నిషేదించింది.
ఇవి తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాయని భారత ఇంటలెజన్స్, కేంద్ర హోంశాఖ అధికారులు భారత సెక్యూరిటీ సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సైట్లను నిషేధించారు.