ఆ సైట్లతో మా సినిమాలు ఢమాల్

హైదరాబాద్ : సినిమా విడుదలైన రెండో రోజు పైరసీ వీడియోలు వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయని.. జనాలు వాటిని డౌన్ లోడ్ చేసుకొని థియేటర్లకు వెళ్లకుండా మా పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సినీ నిర్మాత సురేష్ బాబు. తెలుగు సినిమా పరిశ్రమ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ అధికారులతో మంత్రి కేటీఆర్ బుధవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు సినిమా పైరసీకి పాల్పడుతున్న వెయ్యి వెబ్ సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా సర్వీస్ ప్రొవైడర్లను కేటీఆర్ ను కోరారు. ప్రతీ సినిమాకు కోర్టు ద్వారా వెబ్ సైట్లను బ్లాక్ చేయడం కష్టమని.. ఒక రోజు తీసేసి మరోరోజు సినిమా ఆన్ లైన్ పెడుతున్నారని సినీ నిర్మాతలు వాపోయారు.. పైరసీ వల్ల సినీ రంగం, దానిపై ఆదారపడ్డ వారి భవిష్కత్ అంధకారంలో పడుతోందన్ానరు.

దీనిపై కేటీఆర్ స్పందించారు. పైరసీ అడ్డకట్టవేసేలా సైట్ల బ్లాక్ చేయాలని సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. సినీ పరిశ్రమ బాగు కోసం ఈ విషయమై కేంద్రానికి లేఖ రాస్తామని కేటీఆర్ చెప్పారు. అనంతరం కేటీఆర్ నిర్మాత సురేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *