
అసహనం వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆ వ్యాఖ్యల వల్ల తాను, తన కుటుంబం ఎంత బాధపడింది చెప్పుకొచ్చాడు.. మీడియా వక్రీకరణ వల్ల దేశంలో తనను విలన్ ను చేశారని.. ఎవరి పడితే వారు తిట్టి తనను తన భార్యపిల్లలు, సోదరులు, సోదరీమనులు, స్నేహితులను అవమానాలు గురిచేశారని వాపోయారు. ముంబైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో ఆయన మాట్లాడారు.
తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని.. కొంత మంది తనపై దుష్ప్రచారం చేశారని.. దీని వల్ల తాను చాలా కోల్పోయానని వాపోయారు. ఎక్కడికి వెళ్లినా ఆ బాధ ఇంకా తన వెన్నంటే ఉందంటూ అసహనం వ్యాఖ్యల పర్యావసనాలను ఏకరువు పెట్టారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అర్థం చేసుకున్న అమీర్ ఆ నోటి దురుసు తగ్గించుకుంటే అందరికీ మంచిది..