
బ్రిటీష్ ఏరోప్లేన్ అమెరికాలోని లాస్ వెగాస్ ఏయిర్ పోర్ట్ లో అగ్నిప్రమాదానికి గురైంది. టేకాఫ్ కు రెండు నిమిషాల ముందు మంటల్లో చిక్కుకుంది.. లేకపోతే టేకాఫ్ అయితే గాలిలో వేగంతో అందరిప్రాణాలు పోయేవి.. ఈ విమానంలో దాదాపు 150 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. లాస్ వెగాస్ నుంచి విమానం లండన్ వెళ్లాల్సి ఉంది..
కాగా మంటలు అంటుకున్న వెంటనే ఏయిర్ పోర్ట్ సిబ్బంది.. విమాన ఎమర్జెన్సీ కిటీకీలు పగులగొట్టి ప్రయాణికులను కిందకు దించారు. మంటలు వ్యాపించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. మిగతా అందరూ ప్రమాదం నుంచి భయటపడ్డారు.