Breaking News

ఆ రాతలు తప్పుల తడకలు

ఆ రాతలు తప్పుల తడకలు

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): హరిరార జోగయ్య 60 వసంతాల రాజకీయ ప్రస్థానంలో పేర్కొన్న అంశాలను టిడిపి సీనియర్ నేతయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా ఖండించారు. 1988 డిసెంబర్ 26న వంగవీటి మోహన రంగా చనిపోయారని, అయితే ఆయన సతీమణి టిడిపిలో చేరి బాబును పోగిడానట్లు జోగయ్యకు తెలియదని అన్నారు. రంగా హత్య సమయంలో దండు శివరామరాజు పార్టీలో యాక్టీవ్ గా లేరని, టీచర్ ఎమ్మెల్సీగా శివరామరాజు ఎన్టీఆర్ను విమర్శిస్తూ వచ్చారని, అనంతరం 1996లో శివరామరాజు పార్టీ నుంచి మంత్రి అయ్యారని అన్నారు. చనిపోయిన వ్యక్తి పేరుతో అసత్యాలు రాశారని, రంగా హత్య విషయం వారం రోజుల ముందే తెలిస్తే ఎందుకు ఆ హత్యను ఆపలేక పోయారని ప్రశ్నించారు. అసత్యపు రాతలు మాని ఒక వయసు వచ్చాక విజ్ఞతతో మెలగాలని అన్నారు. రంగా హత్యతో చంద్రబాబుకు, ఎన్టీఆర్ కు ఏ విధమైన సంబంధం లేదని పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదలపై వైసిపి చేస్తున్న ధర్నాకు ప్రజాస్సందన కరువైందని, వైసిపి ధర్నాలు దీక్షలు ఘోరంగా విఫలమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఎప్పడూ అధికారంలో లేకపోతే అప్పడు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని, దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్సే నని అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *