Breaking News

ఆ పిల్లలను విడదీసేందుకు వస్తున్నారు..

Indian conjoined twins Vani and Veena sm

-హైదరాబాద్ వస్తున్న లండన్ వైద్యులు
వరంగల్, ప్రతినిధి : వరంగల్ జిల్లాకు చెందిన అవభక్త కవలలు వీణా-వాణిలు తలలు అతుక్కుని పదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల వారి తల్లిదండ్రులు వరంగల్ జిల్లా బీరిశెట్టి గూడానికి చెందిన నాగలక్ష్మి-మురళీగౌడ్ లు సీఎం కేసీఆర్ ను కలిసి తమ బిడ్డల పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఆయన వారి ఆపరేషన్ ఖర్చును భరించేందుకు సిద్ధమయ్యారు.
దీంతో నగరానికి చెందిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్ ను నిర్వహించడానికి ప్రఖ్యాత గ్రేట్ ఆర్మండ్ స్ర్టీట్ వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీ లను సంప్రదించారు.

గతంలో వీరు మెదడు అతుక్కుని పుట్టిన ఏడాదిన్నర చిన్నారులను విజయవంతంగా వేరుచేశారు. అంతటి ఘన చరిత్ర కలిగిన వీరితో వీణా-వాణిలకు శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ శస్త్రచికిత్సను వైద్యులు నాలుగు దశల్లో చేయనున్నారు. దీనికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ కు ఖర్చు 6 కోట్లు అవుతుందని అంచనాలు వేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *