ఆ పత్రిక కథనాన్ని ఖండించిన గవర్నర్

‘గవర్నర్ గారి టీ పార్టీ’ పేరుతో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ప్రచురితమైన కథనాన్ని ఖండించారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ‘నాపేరు నరసింహా.. ఒకవైపే చూస్తున్న గవర్నర్.. ఏపీకి అన్యాయం చేస్తున్నారని.. తెలంగాణ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని’ కథనం సారాంశం.

తెలంగాణ విన్నపాలకు తొందరగా ఓకే చెప్తున్న గవర్నర్ .. మా మొర మాత్రం వినడం లేదని ఏపీ అధికారుల వాయిస్ కథనంలో ప్రచురితమైంది. ఇంటర్ బోర్డు విభజన, నిధులు, కేటాయింపుల్లో ఆంధ్రా విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదంటూ.. తెలంగాణకు మేలు చేస్తున్నారని కొందరు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ లు విమర్శిస్తున్నట్లు సవివరంగా కథనంలో రాశారు.

కాగా దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు ఉన్న సమయంలో అధికారులే అన్ని చూసుకున్నారని.. సలహాదారులు, అధికారులు తీసుకున్న నిర్ణయాలనే తాను అమలు చేశాను తప్పితే ఏ రాష్ట్రానికి నష్టం చేకూర్చేలా తాను వ్యవహరించలేదని గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ రెండింటికి న్యాయం చేశానని .. ఆ పత్రిక కథనం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రకటనలో విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *