
సీఎం కేసీఆర్ చైనా పర్యటన తర్వాత 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు తదితర విషయాలను చర్చించడానికి గవర్నర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యల నివారణకు తాము తీసుకున్న చర్యలను వివరించారు.
రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 6 లక్షల పరిహారం పెంచామని.. వారి కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొన్నారు. శాసన సభ సమావేశాలపై కూడా చర్చించారు.
కాగా రైతు ఆత్మహత్యలపై ఆంధ్రా మీడియా, పత్రికలు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వ పరువు తీస్తున్నాయని.. ఆంధ్రాలో కూడా జరుగుతున్న తెలంగాణలో జరుగుతున్నాయంటూ హైలెట్ చేస్తూ ఇబ్బందిపెడుతున్నాయని తెలిపారు.