
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై దేశవ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు ఇరకాటంలో పడిపోయారు. అప్పటినుంచి కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. తెలంగాణ పోలీసులు ఎప్పుడు కేసులు పెట్టి లోపలేస్తారోనన్న ఆందోళన టీడీపీలో నెలకొంది. అరెస్ట్ చేసే ధైర్యం లేకున్నా.. చార్జిషీట్ నమోదైతే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు పోయినట్టే..
అందుకే తన కింద ఒకప్పుడు పనిచేసిన కేసీఆర్ వద్దకు శరణు చొచ్చేందుకు చంద్రబాబు నిన్న తెలంగాణ సీఎం ఇంటికి వచ్చినట్టు అర్థమవుతోంది.. పేరుకు అమరావతి శంకుస్థాపన అని చెప్పుకున్నా.. వెనకున్న మతలబు కేసీఆర్ తో కాళ్ల బేరానికేనని తెలుస్తోంది.. అందుకే కేసీఆర్ తో భేటి అయి పాతకక్ష్యలను స్వస్తి పలికి తన ఓటుకు నోటు కేసును ఉపసంహరించుకోవాలని చంద్రబాబు కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
చంద్రబాబు కింద మంత్రి గా పనిచేసిన కేసీఆర్ ఆ కృతజ్ఞతతోనే తన రాజకీయ గురువు కు భిక్ష పెట్టాడట. ‘అన్నా.. మీరు అడిగిన తర్వాత వివాదాలు వదిలేద్దాం ’ అన్నారట కేసీఆర్..
ముఖ్యంగా చంద్రబాబు చొరవ.. హైదరాబాద్ ను వదిలి వివాదాలకు దూరంగా విజయవాడనుంచే పాలన సాగించడంతో కేసీఆర్ చంద్రబాబు కేసును పక్కదారి పట్టించి సేవ్ చేశాడని సమాచారం. అందుకే ఇక వివాదాలకు దూరంగా ఉందని చంద్రబాబు, కేసీఆర్ లు రహస్యంగా 10 నిమిషాలు కేసీఆర్ ఇంట్లో భేటి అయి నిర్ణయించారట..