
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తులను సంతృప్తి పరచడానికి నియమించిన పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులకు మంగళం పాడింది. హైకోర్టులో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వేసిన పిటీషన్లపై హైకోర్టు స్పందించి తెలంగాణ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీ పోస్టులను రద్దు చేసింది.
దీంతో తెలంగాణ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, గాదరి కిషోర్, కోవలక్ష్మీ, శ్రీనివాస గౌడ్, జలగం వెంకట్రావ్, వొడితెల సతీష్ బాబు ల పోస్టులు రద్దయ్యాయి.