
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో బయటపడ్డ ఆడియో టేపులు చంద్రబాబు వి కావని.. మార్పింగ్ చేసి చంద్రబాబు మాటలు పెట్టారని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. అసలు ఆ ఆడియో ఎక్కడినుంచి వచ్చింది.. ఎవరూ విడుదల చేసింది చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. ప్రజలను నమ్మించాడానికి ఇవి చంద్రబాబు మాటలను జోడించి టెక్నాలజీ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు చేసిన కుట్ర అని ధ్వజమెత్తారు.