Breaking News

ఆహార భద్రత కార్డుల భర్తీకి వేళయింది.

ration-card-1024x630

హైదరాబాద్, ప్రతినిధి : ఈ నెలాఖరు నుంచి కొత్తగా తెలంగాణ రాష్ట్ర పేరుతో కేసీఆర్ సర్కారు ఆహారభద్రత కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. కార్డుల కోసం దరఖాస్తులు కోటి దాటడంతో అధికారులు తుది కసరత్తు జరుగుతోంది.

కాగా పల్లె కంటే పట్టణ ప్రాంతాల్లోనే అధిక దరఖాస్తులు వచ్చాయి. వివాదాలు కూడా చెలరేగాయి. వరంగల్ లో కేసీఆర్ పర్యటన సందర్భంగా జనం కేసీఆర్ ను నిలదీశారు. దీంతో సీఎం కేసీఆర్ సమగ్ర సర్వేను పక్కనబెట్టి పేదలను చూసి కార్డులివ్వాలని ఆదేశించారు. దీంతో పట్టణాల్లో చాలా మంది దరఖాస్తులు చేశారు. కోటి మందికి పైగా దరఖాస్తుదారులకు మార్చినెల నుంచి కొత్త కార్డుల వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇవ్వనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *