Breaking News

ఆస్ర్టేలియాలో భారత్xపాక్ యుద్ధం

-15 న ఇండియా-పాకిస్తాన్ ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్

అవును ఈనెల 15న ఆదివారం ఆస్ట్రేలియా భారత్ పాక్ యుద్ధం జరగబోతోంది. దాయాది దేశాల యుద్ధం, అదీ ఆస్ట్రేలియాలో అని ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది క్రికెట్ సమరంలో.. ఆదివారం ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా ఇండియా పాకిస్తాన్ లు అడిలైడ్ వేదికగా తలపడబోతున్నాయి. దీన్ని ప్రత్యక్షప్రసారంలో చూడడానికి కోట్లాది మంది సిద్ధం అవుతున్నారు. ఆదివారం సెలవుదినం రోజు మ్యాచ్ జరుగనుండడంతో పాటు దయాది దేశాలు కావడంతో అభిమానుల్లో హైప్ పెరిగిపోతోంది. కాగా ప్రపంచకప్ లో భారత్ పై నెగ్గిన చరిత్ర పాకిస్తాన్ కు లేదు. మరి ఈసారి అది పునరావృతమవుతుందా.. లేదా అన్నది ఆసక్తిగా మారింది.

ఈ వేడిని మరింత కొనసాగించేంచుదుకు క్రికెట్ ప్రసారాల హక్కు దారు ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్ ఒక వీడియో తీసి నెట్ లో రిలీజ్ చేసింది. దానిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియో పాకిస్తాన్ అభిమాని ప్రతీ వరల్డ్ కప్ ఇండియాను ఓడిస్తే టపాసులు కాలుస్తానని ఎదురుచూడడం.. ఓడిపోవడంతో వాటిని పారేయడం జరుగుతూ ఉంటుంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. క్రికెట్ ను క్రికెట్ లా చూడాలని రెండు దేశాల మధ్య యుద్ధం లా కాదని అభిప్రాయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *