
కరీంనగర్: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఆస్తి పన్ను వసూళ్ళు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేటు నుండి అన్ని మండలాల తహసీల్దార్లను, ఎం.పి.డి.ఓ.లతో దీపం పధకం, ఐ.ఎస్.ఎల్. ఆసర ఫించన్ల పంపిణి, భూమి కొనుగోలు పధకం, ఉపాధి హమి, హరిత హరం, ఆస్తి పన్ను వసూళ్ళ మొదలగు అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల్లో పన్నుల వసూళ్ళలో పురోగతి సాధించని EOPRD లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పన్ను వసూళ్ళ నుండి విద్యుత్ బిల్లులు, లైబ్రరీ సెస్ చెల్లించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయితీకి విద్యుత్ మీటర్ తీసుకోవాలని అన్నారు.హరిత హరం నర్సరీలను అన్ని మండలాలలో ప్రారంభించాలని ఆదేశించారు. ఉపాధి హమి పధకం ద్వారా మండలాలకు మంజూరు అయిన అన్ని పనులను త్వరగా ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి అయిన పనులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తే బిల్లులు చెల్లిస్తారని అన్నారు. ఎస్.సి. లకు 3ఎకరాల భూమి కొనుగోలు పధకం క్రింద జిల్లాలో ఈ సం!! 450 ఎకరాల కొనుగోలు చేయుటకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో 30-50 ఎకరాలు గుర్తించి కొనుగోలు చేయుటకు చర్యలు గైకొనాలని ఆదేశించారు. జిల్లాలో 6,413 మంది ఆసర ఫించన్ దారులకు బ్యాంక్ ఖాతాలు లేవని, వారందరికి వెంటనే ఖాతాలు ప్రారంభించి వివరాలు పంపాలని ఆదేశించారు. దీపం పధకం క్రింద ధరఖాస్తులు స్వీకరించుటకు మరో వారం రోజులు గడువు పొడిగించామని జిల్లాలో ప్రతి ఇంటిలో గ్యాస్ కనెక్షన్ ఉండే చర్యలు తీసికోవాలని అన్నారు. ISL నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని MPDOలను ఆదేశించారు. పూర్తి అయినది ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో JC బి. శ్రీనివాస్ DRDO వెంకటేశ్వర్లు ప్రకాశ్ రావు
తదితరులు పాల్గొన్నారు