Breaking News

ఆస్ట్రేలియా 151 ఆలౌట్

newzelanad

-న్యూజిలాండ్ చేతిలో ఓటమి దిశగా ఆస్ట్రేలియా

న్యూజిలాండ్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో తిరుగులేదనుకున్న ఆస్ట్రేలియాకు భంగపాటు ఎదురైంది. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించడంతో 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన అసీస్ అత్యుత్సాహంతో వికెట్లను పోగొట్టుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకొని పరుగులు సాధించలేదు. షేన్ వాట్సాన్ (23), డేవిడ్ వార్నర్ (34), ఆరోన్ ఫించ్(14), స్మిత్ (4), మ్యాక్స్ వెల్ (1), మార్స్(0) వెంటవెంటనే ఔటవడంతో ఓ దశలో 97 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. చివరకు లోయర్ ఆర్డర్ కొద్దిగా పోరాడడంతో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *