
ప్రపంచకప్ లో పసికూన అప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా పరుగుల ప్రవాహం సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ర్టేలియా 6 వికెట్లకు 417 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ వార్నర్ 178 పరుగులు, మాక్స్ వెల్ 88, స్టీవెన్ స్మిత్ 95 పరుగుల తుఫాన్ సృష్టించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది.
అనంతరం బ్యాంటింగ్ కు దిగిన ఆప్ఘనిస్తాన్ 37.3 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది.. బుధవారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆప్ఘనిస్తాన్ ఏకంగా 275 పరుగుల తేడాతో ఓడిపోయి రికార్డు నమోదు చేసింది.ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక తేడాతో గెలిచిన మ్యాచ్ గా రికార్డు నమోదు చేసింది