ఆస్ట్రేలియా పార్లమెంటును సందర్శించిన హోమ్ శాఖా మంత్రి నాయిని

AUSTRALIA న్యూసౌత్‌వేల్స్ పార్లమెంటును సందర్శించిన తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి

తెలంగాణ రాష్ట్ర హోం శాఖా మంత్రి శ్రీ నాయనినరసింహ రెడ్డి గారు తన ప్రతినిధులు జీహెచ్ఎంసీ  స్టాండింగ్ కమిటీ సభ్యుడు – v శ్రీనివాస్ రెడ్డి గారు,  శ్రీ. మహమ్మద్. అజమ్ అలీ గారు, మరియు – శ్రీ.  సంతోష్ గుప్తా గారుతో  న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ను సందర్శించారు.

ఈమేరకు  వారు న్యూ సౌత్వేల్స్ పాలక పార్టీ సాంస్కృతికశాఖ మంత్రి, ఎంపీ, పార్లమెంటు సభ్యుడు శ్రీ, రే విల్లియమ్స్ తో ఆయన భేటీ అయ్యారు, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించడానికి ఉన్న అవకాశాలను, ఆ దేశ ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారంపై చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల కోసం నిపుణులైన మానవ వనరులు, అంతరాయం లేని విద్యుత్తు, నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు.పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ.కె.సి.ఆర్ గారు ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానమన్, ప్రపంచ దేశాల ఇండస్ట్రియల్ పాలసీలను అధ్యయనం చేసి టీఎస్ ఐపాస్ ని తీసుకొచ్చామని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని అన్నారు. టీహబ్ టాస్క్ మొదలగువంటి ప్రభుత్వ సంస్దలు క్వాలిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లో ఎంతో తోడ్పడుతున్నాయి అని ఇన్వెస్టర్స్ కి వివరించారు. తెలంగాణ లో ఉన్న ట్యాలెంట్ నేడు ప్రపంచానికి అవసరం అని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ కేటీర్ గారి  అకుంఠిత దీక్ష పట్టుదల వాళ్ళ నేడు తెలంగాణ భారత దేశం లోనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో అలాగే  అభివృద్ధి లోకూడా 1 వ స్థానం లో ఉన్నదని వివరించారు. ప్రపంచం లోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఐతే తెలంగాణా భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని గుర్తుచేశారు. రే విల్లియమ్స్ను మొమెంటో తో సత్కారానిచ్చి తెలంగాణ రావాల్సిందిగా కోరారు ఈమేరకు వారు గ్లేడిస్ బేరేజిక్లియాన్ – ప్రీమియర్ అఫ్  న్యూ సౌత్వేల్స్పాలక తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు.

తరువాత  ప్రతిపక్ష నేత మరియు MP జోడి మాకేయ్, MP జూలియా ఫిన్ ,  MP హ్యూ మక్డరోయ్త్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు వారికీ తెలంగాణ ఏ విధంగా సాధించామో, కేవలం మూడున్నర ఏండ్లలో ఎంతో ప్రగతి ని సాధించి భారత దేశం లో నొ౧ రాష్ట్రంగా ముందుకు దూసుకుపోతున్నామని  అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం లో ఇన్వెస్టర్స్ వారి కంపెనీలను స్థాపిస్తే వారు కూడా కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వివరించారు. ఐతే ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా 2nd టియర్ సిటీ పాలసీ / రురల్ పాలసీ ఇతరపట్టణాలల్లో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున అనేక అదననపు పారితోషికాలు లభిస్తాయని వాణిజ్య వేత్తలకు వివరించారు, ప్రతిపక్ష నేత MP జోడి మాకేయ్ నాయని నరసింహ రెడ్డి గారికి పార్లమెంట్ నుంచి జ్ఞాపిక బహుకరించారు. తరువాత వారు పార్లమెంటును సందర్శించి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటు అనుసరిస్తున్న విధానాన్ని, సమావేశాల నిర్వహణ గురించి అధ్యయనం చేశారు వారి తో పటు ఆస్ట్రేలియన్ ఎన్నారై లు అశోక్, అనిల్ మునగాల,  రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్ , సుమేషు రెడ్డి , వాసు తాట్కూర్  ప్రశాంత్ కడపర్తి వినోద్ ఏలేటి, ప్రమోద్ ఏలేటి, కపిల్ కాటిపెల్లి, అరుణ చంద్రల గారు,  తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *