ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ ఘోర ఓటమి చవిచూసింది. ఆట నాలుగో రోజు భారత్ చాప చూట్టేసింది. శిఖర్ ధవన్ మినహా టాప్‌ఆర్డర్ ఘోరంగా వైఫల్యం చెందడంతో.. టీమిండియా 224 పరుగులకే అలౌట్‌ అయ్యింది. నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ వికెట్టును కోల్పోయిన భారత్.. ఆ తరువాత క్రీజులో నిలబడేందుకు బెంబేలెత్తింది. ఆజింక్యా రహానే 10 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. రోహిత్‌ శర్మ, కెప్టెన్ ధోనీ డకౌట్‌లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ థవన్‌తో ఉమేశ్‌ యాదవ్ జత కలిసినా ఫలితం లేకుండా పోయింది. ఉమేశ్‌ యాదవ్ 30 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 224 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌.. ఆసీస్‌ ముందు 128 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.

ఆస్ట్రేలియా ఈ స్వల్ప 128 లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా 130/6 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా 4-0 ఆధిక్యం సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.