Breaking News

ఆస్ట్రేలియా చేతిలో చావుతప్పి గెలిచిన న్యూజిలాండ్

newzelanad.jpg 2

151 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసినప్పుడు అందరూ న్యూజిలాండే గెలుస్తుందనుకున్నారు. బ్యాంటింగ్ మొదలు పెట్టినతర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ వీరవిహారంతో గెలుపు లాంఛనమే అనుకున్నారు. కానీ ఓడలు బళ్లు అయినట్టు ఆస్ట్రేలియా విజృంభించింది. ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ భరతం పట్టాడు. కేవలం 28 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి కివీస్ నడ్డి విరిచాడు. దీంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.

చివరకు కడవరకూ క్రీజులో నిలిచిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ కేన్ విలియంసన్ న్యూజిలాండ్ కు చివరి వికెట్ కు విజయాన్నందించారు. కివీస్ 23.1 ఓవర్లలో 152/9 చేసి చావుతప్పిన చందంగా గెలిచి ఊపిరిపీల్చుకుంది. చివరి 5 ఓవర్లు నాటకీయ పరిణామాల మధ్య జరిగాయి. ఆ 5 ఓవర్లలోనే 23 పరుగులకు 5 వికెట్లు నేలకూలాయి. మరో వికెట్ పడితే కివీస్ ఓడిపోయేది. లాస్ట్ వికెట్ కు విలయం సన్ సిక్స్ కొట్టి న్యూజిలాండ్ కు విజయాన్నందించాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *