
సిడ్నీ టెస్టులో ఇండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 71 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(40), రాహుల్(31)రన్స్ తో నాటౌట్ గా ఉన్నారు. ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. రెండో రోజు 7 వికెట్లకు 572 రన్స్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ స్మిత్(117), వార్నర్(101) సెంచరీలు చేయగా… రోజేర్స్(95), వాట్సన్(81), మార్ష్(73), బర్న్(58) హాఫ్ సెంచరీలు చేశారు