ఆసియా కప్ లో ఇండియా బోణి

461661-ms-dhoni-t20i-squad-700

బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో టీమిండియా బోణి కొట్టింది.. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ ల్లో అదరగొట్టింది.. 45 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 166 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 55 బంతుల్లో 83 పరుగులు, హార్దిక్ పాండ్యా ( 16 బంతుల్లో 31) పరుగులు చేసి భారత్ భారీ స్కోరు బాటలు వేశారు..
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల దాటికి వరుసగా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేయగలిగింది.. షబ్బీర్ 44 పరుగులు చేశారు. నెహ్రా కీలక మూడు వికెట్లు పడగొట్టాడు.. బ్యాంటింగ్ లో అదరగొట్టిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *